Breaking News

క్రీడా స్ఫూర్తిని చాటాలిఎల్కతుర్తి స్పెషలాఫీసర్ శ్రీనివాసులు..

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి

విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎల్కతుర్తి మండలం స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్మెల్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాసులు మాట్లాడుతు గ్రామస్థాయి క్రీడాకారులు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న హనుమకొండ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలోనే ఔత్సాహిక క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో 20 క్రీడాంశంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల చైర్మన్, ఎంపీడీవో ఎన్.విజయకుమార్ మాట్లాడుతూ ఈ మండల స్థాయి పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయని చెప్పారు. మొదటి రోజు కబడ్డీ వాలీబాల్ ఖో ఖో, ఫుట్ బాల్, అథ్లెటిక్స్ , యోగాలు పోటీలు నిర్వహించామని చెప్పారు. మంగళవారం ఈ ఐదు గేమ్తో పాటు మరో 16 గేమ్ లో సెలక్షన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగత్ సింగ్, సీఐ పులి రమేష్, ఎస్సై రాజ్ కుమార్, కార్మెల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లీజల్, స్పోర్ట్స్ అబ్జర్వర్ పి.వెంకట్. పీడీలు, పీ ఈ టీలు తాళ్లపల్లి రాముడు, భోగి సుధాకర్, జి. ప్రేమ్ ప్రసాద్, ఎం ధనలక్ష్మి, కిరణ్ రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం