తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
సినీ నటుడు మోహన్ బాబు న్యూస్ కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై దాడిచేయడాన్ని తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (NUJ INDIA) తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ పత్రిక ప్రకటనలో ఖండించారు. తక్షణం జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. !!తెలంగాణా ముఖ్యమంత్రి , రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఈ విషయంపై తక్షణం స్పందించాలన్నారు. జర్నలిస్ట్ విలువలను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని,ఈ దాడి ప్రజాస్వామ్యంలోని ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిజం పై జరిగిన దాడిగా భావించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసి , వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.