చరిత్ర కలిగిన కళాశాలలో చరిత్ర సృష్టించిన పూర్వ విద్యార్థులు!!
మన ప్రగతి న్యూస్/వనపర్తి బ్యూరో
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చరిత్ర తిరగరాసిన వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒకనాటి ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా పేరుపొందింది, 1974 సంవత్సరంలో కేడిఆర్ నగర్ లో గల రాజా రామేశ్వరం కాలం లో గుర్రాల శాలగా ఉన్న గుర్రాల శాల కళాశాలగా రూపుదిద్దుకొని అప్పట్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాల గా వనపర్తి ప్రాంతానికి చెందిన టైపు కృష్ణయ్య ఆధ్వర్యంలో కొంతమంది అధ్యాపక బృందం విద్యార్థులతో ప్రారంభమైన ప్రైవేట్ డిగ్రీ కళాశాల రానురాను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అప్పటి వనపర్తి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ బాలకృష్ణయ్య కృషి వల్ల ప్రభుత్వ ఆధీనంలో కలిసిపోయింది, ఆనాడు ప్రైవేట్ కళాశాల గా ఉన్న సందర్భంలో పనిచేసిన సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఇప్పటికి కూడా వనపర్తి చరిత్రలో మిగిలిపోయింది, ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా ఉన్న ఈ కళాశాలలో ఉదయం మహిళలు, మధ్యాహ్నం పురుషులు రెండు షిఫ్టులుగా విభజించి కళాశాలను కొనసాగించారు, ఈ కళాశాల ప్రస్తుతం మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా కొనసాగుతుంది పురుషుల డిగ్రీ కళాశాలను కొత్త భవనం నిర్మించి వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీపం గ్రామమైన నర్సింగయ్య పల్లి గ్రామంలో ప్రభుత్వం పురుషుల దగ్గర కళాశాల కొనసాగుతుంది. ఈ కళాశాలలో 1974 నుంచి నేటి వరకు విద్యను అభ్యసించిన బాల బాలికలు అందరూ ఏకతాటిపై ఒకసారి స్వర్ణోత్సవా వేడుకల సందర్భంగా ఎక్కడో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న న్యాయమూర్తులు, పోలీస్ శాఖ , విద్యాశాఖ, ఇంజనీరింగ్ విభాగం, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, తో పాటు ఇతర శాఖలో ఉన్నత శిఖరాల్లో చేరుకున్న ఆనాటి పూర్వ విద్యార్థులు ఈ స్వర్ణోత్సవాలకు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలను నిర్వాణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈనెల 21 ,22 తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది, ముఖ్యమంత్రి ఈ వనపర్తి జిల్లాల్లో చిన్ననాటి చదువులు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్రభుత్వ వనపర్తి జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించారు, అందుకే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన డిగ్రీ కళాశాల పూర్వపు విద్యార్థులు హాజరు కావాలని ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. చరిత్ర కలిగిన ఈ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, కవులు కళాకారులు, ఉద్యోగులు, న్యాయవాదులు జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.