మన ప్రగతి న్యూస్/ నర్సంపేట రూరల్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోనీ జయముకి ఇంజనీరింగ్ కళాశాలలో 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ప్రాంత కార్యసమితి సభ్యులు వేల్పుల రాజ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 75 ఏళ్లుగా ఈ దేశ సంస్కృతిని కాపాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థులను జాతీయవాదులుగా తీర్చిదిద్దుతూ నిత్యం సామాజిక సేవలో ముందుంటూ జాతీయ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని విద్యార్థులంతా కలిసి జరుపుకునే పండుగ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు అని కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ నర్సంపేట నగర కార్యదర్శి రాకం రాకేష్, కలశాల ప్రెసిడెంట్ శ్రీకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.