Breaking News

ప్రెసిడెంట్ గా అల్లేపు శ్యామ్ సుందర్

మన ప్రగతి న్యూస్/సంగెం

తెలంగాణ బీసీ బహుజన
సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అల్లేపు శ్యామ్ సుందర్ ని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా చేస్తున్న పోరాటాలలో చురుకుగా తమ కుల సంఘంలో బీసీ కుల సంఘాలలో ఉన్న వారిని కులాలకు అతీతంగా చైతన్య పరుస్తూ హక్కుల సాధన కొరకు తన వంతు కృషి చేస్తున్న అల్లపు శ్యామ్ సుందర్ ని గుర్తిస్తూ,ఈ పదవిలో అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా అల్లేపు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ..నా పై నమ్మకంతో పదవి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ కి,తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్,తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్,తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు సమ్మయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం