మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాదాసు హరీష్ గౌడ్ క్రీడాకారులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో భాగంగా బుధవారం క్రీడాకారులకు హరీష్ గౌడ్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను కనబరిచి, జిల్లా, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.