Breaking News

బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కు అందజేత

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన కందుల కృష్ణమూర్తికి పంజాగుట్ట నిమ్స్ హాస్పటల్ లో బ్యాక్ పెయిన్ సర్జరీ నిమిత్తము రెండున్నర లక్షల ఎల్ఓసి జూబ్లీహిల్స్ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో బాధిత కుటుంబానికి కందుల జంగయ్యకు ఎల్ఓసి ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్,ఉక్కుర్తి స్వామి,కందుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం