మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట
విద్యాలయంలో మత ప్రచారం చేసేందుకు యత్నించిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజును సస్పెండ్ చేస్తూ డీఈఓ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన కరపత్రం, ఇతర సామాగ్రి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ విషయం జిల్లా విద్యాధికారి కి చేరడంతో ఆ ఉపాధ్యాయుడి నీ సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.