మన ప్రగతి న్యూస్/హత్నూర:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ శ్రీరామ కాలనీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో బుధవారం ఘనంగా గీతా జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఏకధాటిగా గీతా పారాయణం నిర్వహించారు. హత్నూర మండలంలోని ఆయా గ్రామాల నుంచి భక్తులు గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరించాలని… గీత చూపిన బాటలో నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.