Breaking News

సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్.

  • ముఖ్యఅతిథిగా హాజరైన తహాసిల్దార్,ఎంపీడీవో లు.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

నడికూడ మండల కేంద్రంలో బుధవారం సీఎం కప్ ఆటల పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్,ఎంపీడీవో శ్రీనివాస్ లు ప్రారంభించారు. మండల ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ మాట్లా డుతూ..క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటుగా మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

యువకులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొని, సీఎం కప్ గెలుచుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్య మైనవని,ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కారులకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. మండలంలోని గ్రామాల యువకులకు వాలీబాల్, కబడ్డీ,ఖోఖో, రన్నింగ్ మరియు ఇతర క్రీడలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆటలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ తహశీల్దార్ జి. నాగరాజు, ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి, ఎంఈఓ హనుమంత రావు, అబ్జర్వర్ దేవరకొండ ప్రభుదాస్, పీడి ప్రేమనందం, పిఈటి లు శివ, ప్రతిభ రాణి, మండలంలోని పలు గ్రామాల కార్యదర్శులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు,తదితరులు పాల్గొన్నారు.