Breaking News

కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ చామల

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి:-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని మరియు టెక్స్ టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.పత్తి కొనుగోళ్లలో సీసీఐ రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు.అవాంతరాలు లేని కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడ్డంకులు పెడుతోంది.నాణ్యమైన సరఫరా విధానం మొదలైన వాటి పేరుతో పేద,చిన్న మరియు సన్న కారు రైతులలో ఆందోళన కలిగిస్తుంది.పత్తి నాణ్యత భారత ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలపై ఆధారపడి ఉంటుంది.రైతులకు సరఫరా చేసే విత్తనాలలో పత్తి నాణ్యత అనేది ఒక అంశం కాబట్టి నాణ్యతను నిర్ణయించడంలో రైతులకు ఎలాంటి పాత్ర ఉండదు కాబట్టి,పత్తి కొనుగోళ్లలో అవాంతరాలు సృష్టించి,రైతులను సీసీఐ ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం