మన ప్రగతి న్యూస్/ నడికూడ:
నడికూడ మండలం రాయపర్తి పి హెచ్ సి ని బుధవారం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పి హెచ్ సి లోని రికార్డులు పరిశీలించి, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచిం చారు. గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్స్ పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరియు నడికూడ మండల కేంద్రంతో పాటు కంఠాత్మకూర్ సబ్ సెంటర్ లను కూడా సందర్శించి,సార్వత్రిక టీకాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్య క్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ లు స్వాతి, దివ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.