Breaking News

మీడియాపై దాడి హేయం

మీడియా కవరేజ్ లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం ఘోరం

ముక్తకంఠంతో ఖండించిన జనగామ జర్నలిస్టులు

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జనగామ జర్నలిస్టులు నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు Tv 9 మీడియా పై చేసిన దాడిని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఆధ్వర్యం లో ఈ నిరసన కార్య క్రమం నిర్వహించా రు. కాసాని ఉపేందర్ అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లా కార్డులు చేత పట్టుకొని ఆందోళన ధర్నా చేపట్టారు. మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్ట్ లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నినాదించారు. మోహన్ బాబు విధినిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ, అహంకారంతో, మతిభ్రమించి లోగో మైకు తో దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని, ఈ విషయంలో సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని సదరు నటుడు మోహన్ బాబు పట్ల చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శ్రీ భాష్యం శేషాద్రి, పార్నంది వెంకటస్వామి, తగరపు నరసింహులు, ఎస్. ఆనంద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, జాల రమేష్, ఎండబట్ల భాస్కర్, కన్నారపు శివశంకర్, సురేష్, ఉల్లెంగుల మణి, యూసుఫ్, గోపగాని వినయ్ కుమార్, తౌటి గణేష్, జంపాల శ్రీనివాస్, కెమెడీ ఉపేందర్, తాడిచెట్టు సుధాకర్, మాచర్ల ఆశిష్, బాబా, జయపాల్ రెడ్డి, భాష పాక మనీ, సాగర్, రవీందర్, క్రాంతి, వి. ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం