పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
జిల్లాలో గ్రూప్ – 2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం, జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణ, బయో మెట్రిక్ విధానంపై చీఫ్ సూపరింటెం డెంట్ లు, ఐడెంటి ఫికేషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, డిపార్టుమెంటల్ అధికారులు, లోకల్, జాయింట్ రూట్ అధి కారులు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ లకు అవగాహన సదస్సు ను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ (783) గ్రూప్-2 పోస్టులకు గాను నాలుగు పేపర్ల వారీగా ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష, అలాగే 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 3 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 4 పరీక్ష జరగనుందని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరు కోవాలని సూచిం చారు. వంద శాతం బయోమెట్రిక్ అటెం డెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదే శించారు. పరీక్ష హాల్లో పరీక్ష ప్రారంభానికి ముందే ఓఎంఆర్ షీట్ పై ఇన్విజిలేటర్ లు పరీక్షార్థులకు అవగా హన కల్పించాలన్నా రు. ఓఎంఆర్ షీట్ లో అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులు వారి వివరాలను కేటా యించిన ఆయా బ్లాకుల్లో తప్పులు లేకుండా నమోదు చేసేలా చూడాలని తెలిపారు.పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రా నిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించరాదని,పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివే యాలన్నారు. పరీక్ష సమయానికి 144 సెక్షన్ అమల్లో
ఉంటుందని, తెలి పారు , పరీక్ష పేపర్లు, ఓఎంఆర్ షీట్ లను పకడ్బందీగా, తగిన జాగ్రత్త చర్యల నడుమ తప్పనిసరి గా ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించాలని సూచించారు ఇన్వి లేటర్ లతో సమావేశాలను ఏర్పాటు చేయాలని, సెంటర్ లలో సీసీ కెమెరాల పని తీరును సరిచూసుకోవాలని, అభ్యర్థుల హాల్ టికెట్, గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ కార్డును సరిగా చూడాలని, నిర్దేశించిన రూట్ లలో మాత్రమే ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ పత్రాలను తీసుకొని వెళ్ళాలని, పోలీసు బందోబస్తు పకడ్బం దీగా ఉండాలన్నారు
అభ్యర్థులు టీజీ పీఎస్సీ వెబ్ సైట్ ద్వారా గ్రూప్-2 హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు
పరీక్షార్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ పోర్టు ఫోటోను అతికించాలన్నారు.
డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధి కారి లేదా చివరగా చదువుకున్న విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ తో మూడు పాస్ పోర్టుఫోటోలతో పాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీ కరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్ కు అందించాలని తెలి పారు.పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించా లని, అభరణాలు ధరించరాదని సూచించారు.
పరీక్షార్థులు మెహిందీ, తాత్కాలిక టాటూలను వేసుకో రాదని స్పష్టం చేశా రు. పరీక్ష రాసే అభ్య ర్థులు హాల్ టికెట్ ను, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు గుర్తింపు పొంది న ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు ఈ సమీ క్ష సమావేశం లో ఏసీపీ పార్థసారథి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, మునిసిపల్ కమిష నర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్, డీఎం హెచ్ఓ మల్లికార్జున్ రావు, డీఏఓ రామారావు నాయక్, పోలీసు శాఖ అధికా రులు, ఇతర సంబం ధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.