మన ప్రగతి న్యూస్/హత్నూర:
దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో గురువారం క్షేత్రాధిపతి సభాపతి శర్మ, ఆధ్వర్యంలో పుణ్య దంపతులచే చండి హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేద స్వస్తి మండల పూజలు చండీ పారాయణం రుద్రాభిషేకములు దత్త జపం గురుచరిత్ర పారాయణం రామాయణం పారాయణములు శాస్త్రి పురాణ పారాయణములు మండవ హోమాలు యాగ దేవత హోమాలు విష్ణు సంబంధిత హోమాలు బలి ప్రధానం దత్త హోమం చండి పారాయణాలు రుద్రాభిషేకం మంగళహారతి మంత్రపుష్పం తదితర యాగాలతో పుణ్య దంపతులచే ఘనంగా యాగాలు చేయడం జరిగిందన్నారు.