Breaking News

కురుమ ఆత్మగౌర సభను విజయవంతం చేయండి

మన ప్రగతి న్యూస్/హత్నూర:

కురుమ ఆత్మగౌర సభను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు
ఈ సందర్భంగా కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు గారి కిష్టయ్య, మాట్లాడుతూ 14/ 12/ 2024 శనివారం కోపపేట్ లో నిర్వహించే ఆత్మగౌరవ కురుమ సంఘం భవనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధిరామయ్య, రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్య అతిథులుగా హాజరవుతున్నందున జిల్లా మండల వ్యాప్తంగా ఉన్న కురుమ సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు అచ్చిన శ్రీశైలం, పాండు, తొగరుపల్లి శ్రీశైలం, కృష్ణ, కొన్యాల శ్రీశైలం,బక్క నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం