మన ప్రగతి న్యూస్/హత్నూర:
మండల పరిధిలోని నవాబుపేట గ్రామం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఒకే గ్రామం నుండి ఏజెంట్ యాదగిరి 64 పాలసీలు కట్టించడం తో గ్రామాన్ని ఎల్ఐసి వారు బీమా గ్రామంగా ప్రకటించి లక్ష రూపాయల నజరానా గ్రామానికి ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా గ్రామంలో ఆరో ప్లాంట్ నిర్మించేందుకుగాను ఎల్ఐసి ఏజెంట్ తన సొంత డబ్బులు లక్ష 30 వేల రూపాయలు అదనంగా కలిపి మొత్తం రెండు లక్షల 30 వేల తో ఆర్ఓ ప్లాంట్ ను గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ప్రేమ హాజరై రిబ్బన్ కత్తిరించి ఆర్వో ప్లాంటును ప్రారంభించారు.అనంతరం అక్కడె ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్. సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ లవంగ శ్రీనివాసు మాట్లాడుతూ ఎల్ఐసిని ప్రజలు తీసుకోవడం వల్ల పాలసీదారులకు వచ్చే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎల్ఐసి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ పూర్ణచందర్ రాజ్. గ్రామ ప్రత్యేక అధికారి అరవింద్. గ్రామ కార్యదర్శి రాకేష్ కుమార్. గ్రామ తాజా మాజీ సర్పంచ్ వెంకటపురం మల్లేశం.చిక్ మద్దూర్ తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి. మాజీ సర్పంచ్ శ్రీశైలం.పన్యాల తాజా మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి. మధుర తాజా మాజీ సర్పంచ్ మాధవి నవీన్ గౌడ్. కొన్యాల తాజా మాజీ ఎంపీటీసీ విట్టల్ రెడ్డి. ఉప సర్పంచ్ రామ్ చందర్.గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.