Breaking News

మూతపడిన మండల విద్యాధికారి కార్యాలయం

సమ్మె బాటలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

మండలంలోని విద్యా వనరుల కేంద్రాలు మూతపడ్డాయి. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె పాట పట్టడంతో మండల విద్యాధికారి కార్యాలయం మూతపడింది. జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. కావున స్థానికంగా ఉన్న మండల కార్యాలయం మూతపడ్డాయి. ఈ సందర్భంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పూర్తిగా విస్మరించిందని తాము అధికారంలోకి వస్తే చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న తమ సమస్యల పరిష్కరించడం లేదని అందుకు నిరసనగా తమ సమ్మెబాట పట్టినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల మా సమస్యలు పరిష్కరించే అంతా వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.