మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి :
సిపిఐ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సి హెచ్ రాజారెడ్డి
భారత కమ్యూనిస్ట్ పార్టీ( సిపిఐ ) 99 వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలనీ పార్టీ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సి హెచ్ రాజారెడ్డి పిలిపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ మండల కమిటీ సమావేశం ఎండీ రహ్మతుల్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ సిపిఐ దాడిత పీడిత ప్రజల పక్షపాతి అని గత 99 సంవత్సరాలుగా పేద ప్రజల పక్షాన సుదీర్ఘ పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. ప్రస్తుతం దేశంలో నిరంకుశ మతోన్మాద ప్రభుత్వం 3వ సారి అధికారం లోకి వచ్చిందని కానీ ఎన్నికలప్పుడు 400 పై చిలుకు సీట్లతో అధికారాన్ని చేపట్టి భారత రాజ్యాంగాన్ని మారుస్తాం అని ప్రగల్బాలు పలికిన బీజేపీ కి ప్రజలు ఓటు తో చెంప పెట్టు పెట్టారని ప్రస్తుతం రెండు చంక కర్రలతో చంద్రబాబు, నితీష్ కుమార్ లతో దేశంలో అస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ప్రపంచ దేశాలు కమ్యూనిజం వైపు మళ్లుతున్నాయని మొన్నటికి మొన్న శ్రీలంక లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందని కరడు గట్టిన ఫాసిస్టు దేశాలలో సైతం కమ్యూనిస్టులు పుంజుకుంటున్నారని అన్నారు రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు మరింత బలోపేతం అవుతాయని దానికోసం అందరు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండీ యునుస్, మండల కన్వీనర్ సముద్రాల రాజు, ఆశీర్వాదం, యాదగిరి, నాగరాజు ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు పస్తం పృథ్విరాజ్,పొన్న సాయిలు, కొలిపాక రంజిత్, ఎల్లయ్య
తదితరులు పాల్గొన్నారు…