Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేయడం మానుకోవాలి..

తెలంగాణ తల్లి విగ్రహం పై రాద్దాంతం తగదు…

పది సంవత్సరాలలో చేయలేనిది ఒక్క సంవత్సరంలో చేసి చూపించాము..

అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించింది…

లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు..

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

సూరారం కాంగ్రెస్ పార్టి గ్రామ మహిళా అధ్యక్షురాలు భాష బోయిన రమ..

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి

హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టి సూరారం గ్రామ మహిళా శాఖ అధ్యక్షురాలు భాష బోయిన రమ విలేకరులతో మాట్లాడుతూ
బిఆర్ఎస్ మరియు బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడం మానుకోవాలని అన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రాలేదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పోలిక లాగ గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన మీరు. అసలైన తెలంగాణ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తే విమర్శలు చేయడం తగదని ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం మానుకోవాలని అన్నారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతుందని అన్నారు. అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని ప్రతి చిన్న విషయానికి పెద్దగా చేస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత హుందాగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలకు కట్టుబడి బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వానికి మంచి చెడు సూచనలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బిఆర్ఎస్ నాయకుడు పనిగా పెట్టుకున్నారని, పోలీసు రాజ్యం నడుస్తుంది అంటున్న బిఆర్ఎస్ నాయకులు నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేయలేదా మీరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేదని మండిపడ్డారు. ఇకనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని బాధ్యతగా ఉండాలని అన్నారు.