మన ప్రగతి న్యూస్/ వేములపల్లి
దామచర్ల మండలానికి చెందిన బుల్లికుంట తండా నివాసి లావూరి శివ తండ్రి భాష వయసు 24 సంవత్సరాలు కులం లంబాడ కుటుంబ విషయంలో మనస్థాపం చెంది వేములపల్లిలోని ఎన్ఎస్పి పెద్ద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ నుండి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆటోడ్రైవర్ చాపల మనోజ్ గమనించి పోలీస్ లకు సమాచారం అందించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులతో కలిసి కాలువ వెంట మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.