మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఎంపీ ఓ తీరును నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దళిత ప్రజా సంఘాల నాయకులు బోట్ల నరేష్, బట్టు సాంబయ్య, పులి రమేష్, ఎంపిటిసి పోరం జిల్లా అధ్యక్షుడు జన్ను జయరాజ్ మాట్లాడుతూ…2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కారోబార్ వ్యవస్థ రద్దు చేస్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లు యూనిఫామ్ ధరించి విధులు నిర్వహించాలనే విషయాన్ని మండల పంచాయతి అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకు వెళుతున్న క్రమంలో టైం లేదంటూ మీకు ఎక్కడ పని లేదా అదేవిధంగా మాట్లాడడం, మరియు దళిత సంఘాల నాయకులకు కూర్చోమని కనీస మర్యాద ఇవ్వలేదని అన్నారు.. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయవలసిన అధికారి 2018 పంచాయతీరాజ్ చట్టం అమలు చేయకపోవడం ఇది కాదా దళిత మల్టీపర్పస్ వర్కర్ల అధికారుల వివక్షత అని అన్నారు… నల్లబెల్లి మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీ పరిధిలో కేవలం దళితులచే పనిచేస్తున్నారని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి వరంగల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం మాత్రం శూన్యం.. ఇప్పటికైనా 2018 పంచాయతీ రాజ్ చట్టం పై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు బట్టు సాంబయ్య ,సుమన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.