మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న డి.ఏ.వి ఉన్నత పాఠశాల, పైలాన్ కాలనీ నందు ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా తెలంగాణ జెన్కో యస్ఈ బి. రామకృష్ణారెడ్డి విచ్చేశారు, ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన ప్రయోగాలతో పాటుగా తెలుగు సాంస్కృతిక ప్రదర్శన, హిందీ భాషా ప్రదర్శన, గణితానికి సంబంధించిన రకరకాల మోడల్స్, ఆంగ్ల భాషకు సంబంధించిన వ్యాకరణ విశేషాల ప్రదర్శన, సాంఘిక శాస్త్రానికి అనుగుణమైన వాటర్ ప్యూరిఫికేషన్, భూకంప లేఖని మొదలగునవి ప్రదర్శించడం జరిగింది.
అద్భుతమైన ప్రతిభను చూపించిన విద్యార్థులను
టీఎస్ జెన్కో సివిల్ యస్ఈ రామకృష్ణ రెడ్డి డి.ఏ.వి.పాఠశాల ప్రధానోపాధ్యాయులు . పి.వాసుదేవ్ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం, తలిదండ్రులు మొదలైన వారు పాల్గొన్నారు.