మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
విద్యార్థులు శాస్త్రయ భావనలను అవగాహన చేసుకుని నిజజీవితంలో ఆచరించడం వల్ల శాస్త్రీయ దృక్పథం పెరిగి, సమాజం అభివృద్ధి చెందుతుందని పాలకుర్తి ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్ అన్నారు. తెలంగాణ జీవశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం పాలకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఉన్నత పాఠశాల పాలకుర్తిలో మండల స్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్షను మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్షలో పాలకుర్తి పాఠశాలల నుండి ప్రథమ స్థానంలో ఎస్ .మధుకర్, ద్వితీయ స్థానంలో ఎం.శ్రీజ గూడూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని, ఈనెల 28న జనగామలో జరిగే జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికయ్యారని ఇన్చార్జి ప్రధానోపాధ్యా
యులు రమేష్ తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.ఈ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అన్న వజ్జుల నరసిం
హమూర్తి, జయశ్రీ,గోపాల్, కొండయ్య, రమేష్ బాబు, వరలక్ష్మి, వీరమల్ల బాబయ్య, నందకుమార్ లు పాల్గొన్నారు.