Breaking News

ఐరన్ డోర్లను పట్టుకున్న సింగరేణి సిబ్బంది

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

బెల్లంపల్లి ఏరియా మాదారం లోని సింగరేణి కాలి క్వార్టర్ ఐరన్ డోర్లను తొలగించి స్క్రాబ్ కు తరలిస్తుండగా సింగరేణి ఎస్ అండ్ పిసి సిబ్బంది గురువారం పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే..జమేధార్ దశరతం పటేల్ ఆధ్వర్యంలో సిబ్బంది మాదారం లో తనిఖీ చేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఆటో లో ఐరన్ డోర్ ను తరలిస్తుండగా గ్రామ శివారులో పట్టుకున్నారు. దాని విలువ సుమారు 10 వేల పై చిలుకు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుకున్న సామాగ్రీ, ఆటో ను గోలేటి 1 ఇంక్లైన్ కు తరలించడం జరిగింది. ఈ తనిఖీల్లో తపాన్ మండేల్,గొర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.