పేదల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా
ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలి
తండా బాటకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి;
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకొని తండాలను అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. తండా బాట కార్యక్రమంలో భాగంగా గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని దుబ్బ తండా (ఎస్పీ ) గ్రామంలో నిర్వహించిన తండా బాట కార్యక్రమంలో ఝాన్సీ రెడ్డి తండావాసులను ఉద్దేశించి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సుమారు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృత పట్టుదలతో పని చేస్తున్నారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, గిరిజనుల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకు తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబో స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. కార్యకర్తలందరిని కంటికి రెప్పల కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. తండాల్లో నెలకొని ఉన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు తండా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తండాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెండు లక్షలకు పై ఉన్న రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఆందోళన చెందరాదని, రైతులను రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ళ ఆదినారాయణ, దేవస్థాన మాజీ డైరెక్టర్ లోనే శ్రీనివాస్, మాజీ సర్పంచులు వీరమనేని యాకాంతరావు, భూక్య యాకూబ్ నాయక్, ఉప సర్పంచ్ బానోతు కిషన్ నాయక్, మారం శ్రీనివాస్, తొర్రూర్ సొసైటీ వైస్ చైర్మన్ బానోతు రామ్ ధన్ నాయక్, నాయకులు పెనుగొండ రమేష్, భూక్య రాజన్న నాయక్, గుగులోతు నరసింహ నాయక్, ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసులాది యాకయ్య, ఏలూరి యాకన్న, కసిరబోయిన కృష్ణమూర్తి, గుగులోతు బాలు, బొందుగుల కొండయ్య, బానోతు రవి, భూక్య భాస్కర్ తండా పెద్దలు పాల్గొన్నారు.