Breaking News

బంగారం అపహారించిన దొంగను పట్టుకున్న పోలీసులు

మనప్రగతి న్యూస్ /నర్మేట:

దొంగను పట్టుకున్న ఘటన మండలంలోని వెల్డండ గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దండ గ్రామానికి చెందిన నిమ్మ నర్సిరెడ్డి గత నెల రోజుల కింద అతను ,తన భార్య సువర్ణ ఇంటికి తాళం వేసి వ్యవసాయ నిమిత్తం భావి దగ్గరకు వెళ్లారు. అది గమనించిన వెల్డండ గ్రామానికి చెందిన చేర్యాల రమేష్ (27) తండ్రి రాజయ్య, నర్సిరెడ్డి ఇంటి వెనక ఉన్న పొలాల నుండి ఇంట్లోకి చొరబడి గడ్డపారతో బీరువా పలగగొట్టి నల్లపూసల బంగారు గొలుసు (20 గ్రాములు), చైన్ 5 గ్రాములు, ఉంగరం 2.5 గ్రాములు, పట్టగొలుసులు 15 తులాలు, 2000 రూపాయలు నగదును అపహారించాడు. శుక్రవారం రోజున జనగామ జిల్లా కేంద్రానికి అట్టి సొమ్మును అమ్మడానికి వెళ్తుండగా వెల్డండ గ్రామంలో పోలీసు లు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసిన రమేష్ పారిపోవడానికి ప్రయత్నిoచగా పోలీస్ లు చాకచక్యంగా పట్టుకున్నారు. తన వద్ద ఉన్న ఆభరణాలను స్వాధీనం చేసుకొని రమేష్ ను రిమాండ్ కు పంపనైనదని సీఐ అబ్బయ్య, ఎస్సై నగేష్ తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం