Breaking News

ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్లు

మన ప్రగతి న్యూస్/నర్మెట్ట

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధులతో శుక్రవారం నర్మేట లో ఐమాక్స్ లైట్లను జిల్లా ఉపాధ్యక్షులు గంగం నర్సింహారెడ్డి ప్రారంభించారు.జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా ప్రతి గ్రామంలో వీధి లైట్ల ఏర్పాటు కోసం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఫండ్ కింద నర్మేట మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి శివాలయంకు ఒక లక్ష రూపాయల ఐమాక్స్ లైట్లు మంజూరు చేసినందుకు కిరణ్ కుమార్ కి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోజిల్లా సహాయ కార్యదర్శి వలబోజు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ. కళ్యాణం మురళి, శివాలయ కమిటీ కార్యదర్శి జంగిటి అంజయ్య, దేవులపల్లి భాగ్యలక్ష్మి ప్రతాప్, గ్రామ ఉపాధ్యక్షులు కొన్నె తిరుపతి, కొన్నే అంజయ్య,ముక్కెర రాజేష్ యాదవ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె ప్రభుదాస్, చెవుల రాజు, తిగుళ్ల భూపతి రెడ్డి,మేకల పెద్దాపురం, పులి మధుసూదన్, సంగీ మల్లేష్, బత్తుల కిట్టయ్య,దన్నారపు మురళి,ప్రజ్ఞాపురం యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి