మనప్రగతి న్యూస్ /నేరడిగొండ.
బోథ్ నియోజకవర్గం లోని ఇచ్చోడా మండలనికి చెందిన అడిగాం (B)గ్రామానికి చెందిన పారుబాయి మహిళ కి 25.000 /-వేల చెక్కుని అలాగే 42000/తొడసాం మారుతీ కి శనివారం రోజున బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం నేరడిగొండ లొ బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ చెక్కులని అందించారు.ఈ సందర్బంగా శాసనసభ్యులు అనిల్ జాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశ పెట్టినా సీఎంఅర్ఎఫ్ పథకం లొ మంజూరైనా చెక్కులు మాత్రమే అందిస్తున్నాం అని అన్నారు. అలాగే ఎవరైనా సరే ప్రయివేట్ ఆసుపత్రి లొ ఆపరేషన్ లు చేసుకుంటే వారి కి యాబై శాతం ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లీస్తుంది అని అన్నారు.అలాగే కెసిఆర్ అభివృద్ధి చేసినంత కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అని అన్నారు. కెసిఆర్ హయాంలో ఒక ఎమ్మెల్యే ని ఒక మంత్రి ని కలవడానికి ఎవరి అనుమతి అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ని ఒక మంత్రి ని కలవడానికి ఒక నెల ముందే అనుమతి పొందాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. నేను ప్రజల నుండి వచ్చిన వ్యక్తి ని ప్రజల కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. ప్రజలే నా దేవుళ్ళు ప్రజల కోసం ఎందకైనా నేను సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమం లొ ఇచ్చోడా మండలం కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాజీ సర్పంచ్ సుభాష్ తిరుమల గౌడు తదితరులు పాల్గొన్నారు.