మనప్రగతి న్యూస్ /తలమడుగు.
ఆదిలాబాద్ జిల్లా లోని బజార్ హత్నూర్ మండలం లొ డెడ్రా గ్రామనికి చెందిన అర్కా బీంబాయి అనే మహిళా పై చిరుత పులి దాడి చేసి గాయపరచింది. శనివారం నాడు ఆమె ఉదయం పూట బహిర్భూమికి వెళ్తున్న సమయం లొ పక్కన పొదల్లో దాగి ఉన్న పులి ఒక్కసారి ఆమె మొకం పై పడి కరిచింది. వెంటనే ఆ మహిళా కేకలు వేయటం తో పులి పారిపోయింది. వెంటనే ఆమెను రిమ్స్ఆసుపత్రిలొ చేర్పించారు.గత నెల రోజుల నుండి ఎక్కడో ఓచోట పులి ఆవులను గాయపర్చి చంపివేస్తుంది. ఇకనైనా మాకు రక్షణ కలిపించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.