Breaking News

మన ప్రగతి న్యూస్ ఎఫెక్ట్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మనప్రగతి వెబ్ న్యూస్ లో శుక్రవారం వెలువడిన “చెత్త తీశారు.. ఎత్తడం మరిచారు” వార్త అధికారులను పరుగులెత్తించింది. నడికూడ పాత గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మొత్తం చెత్తతో నిండి పోయి ఉండి, స్థానిక ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. ఈ అంశం శుక్రవారం నాడు మనప్రగతి వెబ్ న్యూస్ లో ప్రచురితం కావడంతో సంబంధిత అధికారులు స్పందించి, శనివారం ఉదయమే జిపి సిబ్బంది సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్తను ఎత్తి ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళి, ప్రధాన రహదారిని శుభ్రం చేయడం జరిగింది. దీనితో గ్రామస్తులు మనప్రగతి న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రాంత సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర వహించినందుకు గాను స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.