మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట ఫోర్ అంగన్వాడీ కేంద్రంలో ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇనిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జిల్లా కోఆర్డినేటర్ నల్లబెల్లి రాజు పాల్గొని మాట్లాడుతూ ప్రతి గర్భిణీ బాలింత స్త్రీలు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలని, శరీరానికి కావలసిన అంత అయోడిన్ ఉప్పును వాడాలని తెలియజేశారు.
మన పెరటి తోటలో సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు క్రమం తప్పకుండా తినాలని తెలిపారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి స్థానిక అంగన్వాడీ టీచర్ నల్లభారతి మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, గర్భిణీ బాలింత స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో ప్రతిరోజు ఒక పూట భోజనం, 200 గ్రాముల పాలు, ఒక గుడ్డు అందజేస్తున్నామని, ప్రతిరోజు గర్భిణీ బాలింత స్త్రీలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయాలని తెలిపారు. ఇంటికి భోజనం తీసుకు వెళ్లడం ద్వారా గర్భిణీ బాలింతలు పూర్తిస్థాయిలో తినలేరని దానివల్ల అంగన్వాడి లక్ష్యం నెరవేరదని, గర్భిణీ స్త్రీ ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనివ్వాలంటే పౌష్టికాహారం తప్పక తీసుకోవాలని తెలిపారు. ప్రతి తల్లి తను ఆరోగ్యంగా ఉంటూ కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలని కోరారు.
బాలింత స్త్రీలు తీసుకునే ఆహారం పైనే బిడ్డకు ఇచ్చే పాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి గర్భిణీ గా నమోదైనప్పటినుండి ఆరు నెలల బాలింత వరకు ఇచ్చే ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశం లో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్ల భారతి, గ్లోబల్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ జిల్లా కోఆర్డినేటర్ నల్లబెల్లి రాజు, సభ్యురాలు ఉష, ఏ ఎల్ ఎం ఎస్ సి సభ్యులు అడ్డగట్ల భాగ్య, చార్ల మౌనిక, ఆశ కార్యకర్త రమ,అంగన్వాడీ ఆయా పైండ్ల సునీత, స్వర్ణలత,స్వాతి, నూర్ బీ, మౌనిక, శిరీష, శ్వేత, సాయిప్రియ, పూజిత,మంజుల,నాగజ్యోతి, లావణ్య,గర్భిణీ, బాలింత స్త్రీలు పాల్గొన్నారు.