మన ప్రగతి న్యూస్/తల్లాడ
నేలకొండపల్లిలో నవంబర్ 27న జరిగిన జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి, మర్డర్ మిస్టరీని త్వరగా ఛేదించినందుకు గాను, కారేపల్లి సిఐ బి. తిరుపతిరెడ్డి ని, శుక్రవారం ,ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కమిషనర్ కార్యాలయంలో మెమొంటో అందించి, అభినందించారు. నేలకొండపల్లి లో వృద్ధ దంపతులు ఎర్ర వెంకటరమణ, కృష్ణకుమారి, లను గుర్తు తెలియని వ్యక్తులు నవంబర్ 26, రాత్రి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసును ఛేదించడానికి కారేపల్లి సిఐ బి. తిరుపతి రెడ్డి, ఎంతో కృషిచేసి, వారిని పట్టుకున్నందుకు గాను ఆయనను అభినందిస్తూ, సిపి మెమోంటో ను అందజేశారు .