Breaking News

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.

గత ప్రభుత్వంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను పెంచింది.

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని విద్యార్థులు మాత్రం చదువుపై దృష్టి సారించి ఉన్నతంగా రాణించాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు 14వ వార్డ్ లో బీసీ సంక్షేమ హాస్టల్ ను సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు అందుతున్న భోజన వసతులు తదితర వాటిని పరిశీలించారు. ఈరోజు నుండి అమలవుతున్న కొత్త డైట్ మెనూ ను సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఆలకుంట మహేందర్ . ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చితే సంక్షేమ హాస్టల్లో ఎలాంటి సమస్యలు లేవని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సమకూర్చుతున్నారని విద్యార్థులు ఎలాంటి అపోహ పెట్టుకోవద్దని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని వారి మాటలను ఎవరు పట్టించుకోవద్దని అన్నారు. బియ్యం సరిగా ఉడకటం లేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని వెంటనే మంచి బియ్యం అందించేలా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గదృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే బియ్యం అందజేస్తామని అన్నారు. ఈరోజు నుండి కాస్మోటిక్ చార్జీలు పెరుగుతున్నాయని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో 3 తరగతి నుంచి 7 తరగతి వరకు 950 రూపాయలు చెల్లించే వారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1330 రూపాయలు చెల్లించనుందని అలాగే గత ప్రభుత్వంలో 8 తరగతి నుంచి 10 తరగతి వరకు 1100 రూపాయలు చెల్లించే వారికి కాంగ్రెస్ వచ్చాక 1540 రూపాయలు ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు గత ప్రభుత్వం 1500 రూపాయలు చెల్లించగా కాంగ్రెస్ ప్రభుత్వం 2100 రూపాయలు చెల్లిస్తుందని అన్నారు. పెరిగిన కాస్మోటిక్ చార్జీలు త్వరలోనే విద్యార్థులకు అందేలా చూస్తామని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కు ఏమి ఏం చేయాలో తోచలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండడంతో అధికారం కోసం నాన పాట్లు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని నేటి విద్యార్థులు రేపటి మన భవిష్యత్ ఆస్తి అని దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండల అధ్యక్షులు తప్పేట శంకర్ పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదారి మధు యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్ దళిత పర్య రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సంపత్. సందీప్. అనిల్. రఘు. తదితరులు పాల్గొన్నారు