Breaking News

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.మంత్రి కొండ సురేఖ.

మన ప్రగతి న్యూస్/హత్నూర:

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ అడవి శాఖామంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన న్యూ కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి కొండ సురేఖ, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని న్యూ కామన్ డైట్ మెనూ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు మొట్టమొదటిసారిగా కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యను అభ్యసించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విద్యార్థి పై లక్ష రూపాయలు పైగా ఖర్చు చేస్తుందని కార్పోరేట్ కళాశాలకు దీటుగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహపంకి భోజనం చేశారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి


గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పై ఆగ్రహించిన మంత్రి.
అంబేద్కర్ కళాశాలలో భోజనానికి అవసరమే వస్తువుల స్టోరేజ్ రూములు ఆమె పరిశీలించారు.వంటలకు ఉపయోగించే కిరాణం వస్తువు ప్యాకెట్లు నాణ్యత లేవని వెంటనే సంబంధిత ల్యాబ్ కు పంపియాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇట్టి విషయంపై కళాశాల ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ సీఈవో స్వప్న, ఎంపీడీవో శంకర్, డిప్యూటీ తాసిల్దార్ దావత్ హైమద్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అజాత సత్యం, నాయకులు రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు కర్రె కృష్ణ, మణిదీప్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.