బట్టు చైతన్య. పి వై ఎల్ జిల్లా కార్యదర్శి. డిమాండ్.
మన ప్రగతిన్యూస్ / కొత్తగూడ
ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ కొత్తగూడ గంగారం మండలాల నిర్మల జనరల్ బాడీని స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ పాలడుగు కృష్ణ స్మారక భవనంలో కల్తీ వెంకన్న అధ్యక్షతన నిర్వహించి, స్థానిక సెంటర్లో నినాదాలతో కూడుకున్న ప్లే కార్డ్స్ తో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బట్టు చైతన్య పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలో చట్ట వ్యతిరేకంగా నడుపుతున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని, గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల భారీ నుండి యువతను కాపాడాలని, గుట్కా అంబార్ పాన్ మసాలాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మద్యం గంజాయి డ్రగ్స్ పేరుతో యువతను పెడమార్గం పట్టిస్తూ పాలకవర్గ ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారని అన్నారు. సమాజ మార్పు కోసం బాధ్యతాయుతంగా ఉండవలసిన యువత నేడు దుర్ వ్యసనాల మూలంగా పెడదారి పడుతున్నారని వారు అన్నారు వెంటనే ప్రభుత్వాలు అరికట్టాలనిడిమాండ్ చేశారు.
అనంతరం కొత్తగూడ గంగారం నూతన మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షులుఈసంరామస్వామి,
ప్రధాన కార్యదర్శి: తాళ్ల పెళ్లి ప్రభాకర్లతో పాటు 13 మంది కార్యవర్గ సభ్యులను ఏకాగ్రభంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, గట్టి సురేందర్, యాదగిరి యుగంధర్,పసునూరి రాజమల్లు, మద్దెల వెంకటేష్, కాసర్ల నాగేష్, గట్టి సతీష్,గణేష్, ఐలబోయిన నరేష్,తదితరులు పాల్గొన్నారు.