మన ప్రగతి న్యూస్/ రేగొండ.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం రేగొండ మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సుమారు 20 లక్షల(నరేగా బి) నిధులతో నిర్మాణం చేసే నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలను అభివృద్ధి చేయడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకు విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దమ్మన్నపేట గ్రామాభివృద్ధి పై గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులతో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి పలువురి సూచనలు సలహాలు తీసుకున్నారు. తన వంతు కృషిగా గ్రామ అభివృద్ధికి పాటుపడతానని గ్రామస్తులకు పెద్దలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, రేగొండ పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, కొడవటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి ,ఎన్ ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నాయినేని సంపత్ రావు, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, జిల్లా నాయకులు పున్నం రవి, మేకల బిక్షపతి, రేగొండ మండల పార్టీ అధ్యక్షులు ఇప్ప కాయల నరసయ్య, మాజీ జెడ్పిటిసి పత్తి వినోద ప్రభాకర్, మాజీ ఎంపీటీసీలు మైస సుమలత, బిక్షపతి, పట్టెం శంకర్, మట్టిక సంతోష్, మాజీ సర్పంచ్ క్యాతం సదయ్య ,బీసీ సెల్ ఉమ్మడి రేగొండ మండల అధ్యక్షులు పొనుగోటి వీరబ్రహ్మం, రామారావు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
