మండల కేంద్రాలో అంబేద్కర్ భవనాలు కనీసం శంకుస్థాపన కరువయే
2025,ఏప్రిల్ 14 వరకన్న జిల్లాలోని అంబేద్కర్ భవన్
లనునిర్మాణాలుపూర్తిచేస్తారా..
ఆవేదన వ్యక్తం చేసిన అంబేద్కర్ భవన్ & విగ్రహ నిర్మాణ సమితి జిల్లా చైర్మన్ దళితరత్ననెమలినర్సయ్యమాదిగ
మన ప్రగతి న్యూస్ /ములుగు
ములుగు జిల్లా కేంద్రం లోని ఎస్సీ కమ్యూనిటి హాల్ లో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మరాఠీ రవీందర్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటుచేసినసమావేశమునకు ముఖ్య అతిథులు అంబేద్కర్ భవన్ విగ్రహ నిర్మాణ సమితి జిల్లా చైర్మన్ దళిత రత్న అవార్డు గ్రహీతనెమలినర్సయ్యమాదిగ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా కొనసాగుతున్న రోజుల్లో ములుగు డివిజన్ లో ప్రతి మండలానికి అంబేద్కర్ భవన్ లను ప్రభుత్వం నిర్మాణం చేయాలని డిమాండ్ చేసిన చరిత్ర అంబేద్కర్ భవన్ విగ్రహ నిర్మాణ సమితి దని పోరాటాల తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తదుపరి ములుగు జిల్లా నిర్మాణం లో గత ప్రభుత్వం పై జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మరియు జిల్లాలోని అత్యధిక దళిత జనాభా ఉన్న ప్రతి గ్రామానికి అంబేద్కర్ భవన్ లు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నో దపాలుగా కార్యాచరణ తో కూడిన పోరాటాలతో సాధించిన చరిత్ర అంబేద్కర్ భవన్ విగ్రహ నిర్మాణ సమితి దని ఆనాడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో వెనుకబడ్డ డివిజన్ డివిజన్ అయిన ములుగు కు మాదిగ,మాల ఆదివాసీ ఉప తెగ, కులాల నుండి జిల్లా కమిటీ సభ్యులుగా నియమించాలని సామాజిక న్యాయ పోరాటాలకు ఆదేశించిన ఘనత భారత దేశ సామాజిక ఉద్యమాల వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ కే దక్కిందని ప్రజలకు, ప్రజాస్వామ్య వాదులకు పిలుపునిచ్చారు .
గత ప్రభుత్వంలో ములుగు జిల్లాకు 14 అంబేద్కర్ భవన్ లు, ప్రతి మండల కేంద్రంతో పాటు కొన్ని అత్యధిక మాదిగ దళిత జనాభా కలిగిన గ్రామాల్లో అంబేద్కర్ భవన్ అసంపూర్తిగా నిర్మాణం చేసింది. అట్టి అంబేద్కర్ భవన్ లు మంజూరు చేయించుకునే కాడ ఎన్నో సార్లు రాష్ట్ర రాజధానిలో దళిత అభివృద్ధి శాఖకు జిల్లా కేంద్రాలకు పలు ధఫాలుగా విజ్ఞప్తులతో సామాజిక న్యాయపంధా ను ఉపయోగించి పోరాటం చేసి భవనాలు సాధించిన చరిత్ర అంబేద్కర్ భవన్ & విగ్రహ నిర్మాణ సమితి దక్కిందని ప్రజలకు పిలుపునిచ్చారు.
మంజూరైన అంబేద్కర్ భవన్ నేటీకి సంవత్సరాలు గడుస్తున్నా జిల్లాలో అంబేద్కర్ భవన్ లు అసంపూర్తి భవనాలుగా పూర్తిస్థాయిలో నిర్మాణం కాక జిల్లాలో కొట్టుమిట్టాడుతున్నాయని అంబేద్కర్ భవన్ లు నిర్మాణానికి తాత్సారం చేయడం వెనుక దళితులను అట్టడున ఉంచడమని సాక్ష్యంగా నిలుస్తుందని నెమలి నర్సయ్యమాదిగ, ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ భవన్ లు నేటికీ పూర్తిస్థాయి నిర్మాణం కాక దళితులు ఆదివాసీలు అణగారిన వర్గాల ప్రజలు వారి వారి సమాజాభివృద్ధి సమావేశాలు నిర్వహించుకునే కాడ ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని స్వయంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ కి విన్నవించడం జరిగిందని ఆ దిశగా జిల్లా పాలన యంత్రాంగం అంబేద్కర్ భవనాలు నిర్మాణం పూర్తిచేసే కాడ కాలయాపన చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు
వచ్చే నూతన సంవత్సరం2025, ఏప్రిల్ 14 వరకుజిల్లాలో ఏ రెండు మూడు భవనాలను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీ ని అవమానించడమేని సాక్ష్యం మిగులుతుందని. మిగతా మండలాల ప్రజలు మిగతా గ్రామాల ప్రజలు అవమానించినట్టే అవుతుందని వెంటనే జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇప్పటికే మంజూరి అయిన అంబేద్కర్ భవన్, లను అన్ని మండల కేంద్రాల్లో తో పాటు మంజూరి అయిన అంబేద్కర్ భవన్, గ్రామాలలో ప్రభుత్వం అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులు పూర్తి చేస్తూ ప్రారంభోత్సవం చేయాలని విజ్ఞప్తి చేశారు
భారత దేశ సామాజిక ఉద్యమాల వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన సూత్రాలతోఏర్పాటు చేసినటువంటి ఉద్యమం అంబేద్కర్ భవన్ & విగ్రహ నిర్మాణ సమితి
ములుగు జిల్లాలో అంబేద్కర్ భవన్ లు 14 భవనాలను మంజూరు చేయించే కాడ ఏ స్థాయి లో ఉద్యమించిందో వాటిని ఏప్రిల్ 14 వరకు అన్ని భవనాలు ప్రారంభించే కాడ ఏమాత్రం కాలయాపన జరిగినా ప్రభుత్వం పై ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు
కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు వావిలాల స్వామీమాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి రమేష్ మాదిగ, అంబేద్కర్ ఫీలసాఫీ దళిత నాయకులు నద్ధునూరి రమేష్ మాదిగ, మహాజన గుడిసె వాసుల సంఘం కో ఆర్డినేటర్ నాంపల్లి నాగరాజ్ మహాజన్ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పసుల రాజమౌళి మాదిగ, అంబేద్కర్ ఫీలసాఫీస్ట్ కనకం దాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి పెండ్యాల సుందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.