Breaking News

కనీస వేతనం అమలు చేయాలి, మల్టీపర్పస్ విధానం రద్దుకై ఈనెల 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు.

మన ప్రగతి న్యూస్/హత్నూర:

కనీస విత్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం ఆదివారం మండల పరిధిలోని దౌల్తాబాద్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, హాజరై మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి గ్రామాన్ని అద్దంలా తయారు చేస్తున్న నేటికీ కనీస వేతనం లేదన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గ్రామపంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ప్రశ్నించారు. గత పది సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వం వేతనాల పెంచాలని అనేక సందర్భాలు అడిగిన వేతనాలు పెంచకుండా పని భారం పెంచిందని గత సమ్మె సందర్భంగా అధికారులకు వస్తే వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఊసు ఎత్తడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనాలు చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మండలంలో ఆరు నెలల నుండి వేతనాలు అందకుంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుడు ఎలా బతుకుతాడని ప్రశ్నించారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని లేనిచో ఎంపీడీవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు నాగభూషణం గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు శంకర్ ఎల్లయ్య వెంకటయ్య అశోక్ రాములు, బిక్షపతి నాగయ్య నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం