Breaking News

 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి

గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదు 

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి 

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

పేద ప్రజల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమానండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని గూడూరు, నర్సింగాపురం తండా గ్రామాల ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోవు స్థానిక
సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని కార్యకర్తలకు స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలకు వివరించాలని సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సబ్సిడీ గ్యాస్, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల్లో కొత్త, పాత అనే తేడా ఉండకూడదు అని, అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సమన్వయంతో పనిచేసి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ తో వందలాది మది రైతులు లబ్ధి పొందారని, రైతుల్లో మరింత చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని, ప్రతిపక్షాల విమర్శలను గ్రామస్థాయిలో తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో గూడూరు, నర్సింగాపురం తండా గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కష్టపడే కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, గూడూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు బెల్లి దేవేందర్ యాదవ్, సేవాదళ్  రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ళ ఆదినారాయణ, మాజీ సర్పంచులు మాచర్ల పుల్లయ్య, భూక్య శ్రీనివాస్ నాయక్, నాయకులు చిక్కుడు రాములు, పటూరి శ్రీనివాస్,కోడూరు మురళీధర్ రెడ్డి, లొంక చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.