Breaking News

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

ఆదివారం గుంటూరు నల్లపాడు గ్రౌండ్స్ లో జరిగిన మాలల సింహ గర్జనకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక హిల్ కాలనీ పైలాన్ కాలనీ నుంచి ప్రజలు నాయకులు ఆదివారం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నంది కొండ మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  క్రిమిలేయర్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణచేయమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టముంటే చేసుకోండి లేకపోతే లేదని చెప్పిందని అది కూడా ఈ విధంగా తెలియజేయడం ఆశాస్త్రీయం, న్యాయసూత్రాలకు విరుద్ధం అని దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని
వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు రవింద్ర భూపతి, యాళ్ల విజయ్,జక్కుల శాంసన్, వెంకట సుబ్బయ్య, పచ్చి మాల బాల కుమార్, రాంప్రసాద్ పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి