మన ప్రగతి న్యూస్/ రేగొండ.
భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన గడ్డం స్వామిదాసు కు రూ.2,50,000/ వేల విలువైన ఎల్వోసీ చెక్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు. స్వామిదాసు గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, చికిత్స నిమిత్తం వారికి ప్రభుత్వం నుండి విడుదలైన చెక్కును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఎల్వోసి ద్వారా ప్రాణదానం చేస్తున్నాయని అన్నారు.దరఖాస్తు చేసుకున్న కొద్దిగంటల్లోనే ఎల్వోసితో చికిత్స సహాయం పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జగ్గయ్యపేట మాజీ ఎంపీటీసీ దుగ్యాల సునీత రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ కా శెట్టి రాజయ్య, సుల్తాన్పూర్ మాజీ సర్పంచ్ అంబాల చందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.