తుడుం దెబ్బ ములుగు జిల్లా కమిటి..
మన ప్రతి న్యూస్/ ఎటూర్ నాగరం
తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పులిచే బాలకృష్ణ ఆధ్వర్యంలో ఐటిడిఏ ఏటూర్ నాగారం కొమరం భీమ్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతూ సిఆర్టి నోటిఫికేషన్ను రద్దు చేయాలని ,ఆదివాసి అభ్యర్థులనే నియమించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ పోడెం బాబు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొక్కుల రవి డిమాండ్ చేశారు. లేనియెడల ఈనెల 23న ఐటీడీఏ ముట్టడి ఉంటుందని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు పొదెం నాగేశ్వరరావు మండల అధ్యక్షులు వజ్జ నరేష్ ,గుండ్ల పాపారావు, ఆలం నాగేష్ , సులోచన ,సామంత తదితరులు పాల్గొన్నారు.