- బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల అవార్డులతో సహా ఆత్మ సంరక్షణ చదువుతోపాటు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలి విద్యార్థులు
- ప్రభుత్వ ఆదరణ లభిస్తే మరిన్ని జిల్లా అవార్డులు సాధించవచ్చు అసోసియేషన్ అధ్యక్షులు పాదం రవీందర్
మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా స్థాయి సబ్ జూనియర్,సీనియర్ బాక్సింగ్ పోటీ ఛాంపియన్ షిప్ సెలక్షన్స్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచిర్యాల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నస్పూర్,కృష్ణ కాలనిలోని శివాలయం మైదానంలో ఈ పోటీలు చైర్మన్ నిట్టూరి మైసూర్ ప్రారంభించారు,జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పాదం రవీందర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ జిల్లాలో బాక్సింగ్ క్రీడ పట్ల క్రీడాకారులు మొగ్గు చూపుతున్నారని జిల్లాలో ప్రతి మండలంలో బాక్సింగ్ క్రీడా స్ఫూర్తి తీసుకు వెల్లుతున్నమని,క్రీడా జిల్లా అవార్డుల ఆశయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అదేవిధంగా యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ముగ్గురు క్రీడాకారులు మంచిర్యాల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలుపుటకు గర్వపడుతున్నామని అన్నారు.రాష్ట్ర జాతీయస్థాయిలోమన జిల్లా క్రీడాకారులు మంచి పథకాలు తీసుకొస్తున్నారని ఇది మంచి శుభ పరిణామంగా ఆనందం వ్యక్తపరిచారు.బాక్సింగ్ క్రీడ పట్ల తల్లితండ్రులు బాధ్యతగా శిక్షణ
ఇప్పింఛాలని,బాక్సింగ్ అనేది సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం నుండి లేదా ఇతర సంస్థల నుండి ఆర్థిక సాయం అందిస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని అన్నారు.డిస్టిక్ లెవెల్ లో గెలుపొందిన క్రీడాకారులు జనవరి 20 తారీకు నుండి షేక్పేట్ హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో వాళ్ళు పాల్గొంటారని తెలిపారు,ఈ కార్యక్రమంలో మంతిని మల్లేష్, ఎమ్మార్పీఎస్ పోలీస్ బ్యూరో సభ్యులు అంగడి రాజేష్,బ్లాక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి పంబాల ఎర్రన్న,కౌన్సిలర్ రాజు నాయక్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్,పాద మహేందర్ చీఫ్ గోల్డ్ మెడలిస్ట్, శివాలయం కమిటీ మెంబర్ బోరపాటి మారుతి, కోచస్ జగత్ సాయి,శ్రీకాంత్,సందీప్,రంజిత్, జే.ఎస్.పి బాక్సింగ్ క్లబ్ సెక్రెటరీ తిరుపతి,తదితరులు పాల్గొన్నారు