Breaking News

మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టు.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

సిద్ధిపేట జిల్లా జగదేవ తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి పథంలో తమ వంతు సేవలందిస్తూనే గ్రామంలోని అభివృద్ధి పనులైన సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, హైమస్ లైట్లు, పంచాయతీ భవనాలు, స్మశాన వాటికలు కుల సంఘాల భవనాల పాఠశాలల నిర్మాణాలు చేపట్టి బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర సర్పంచుల ఫోరం పిలుపు మేరకు సోమవారం అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పలువురు మాజీ సర్పంచ్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషనులకు తరలించారు.
జగదేవపూర్ మండల మాజీ
సర్పంచ్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.అందులో భాగంగానే ధర్మారం మాజీ సర్పంచ్ రాజు ముదిరాజ్ ,అనంత సాగర్ సర్పంచ్ లావణ్య మల్లేశం,కొత్తపేట సర్పంచ్ వెంకట్రాం రెడ్డి, తిమ్మాపూర్ సర్పంచ్ రజిత రమేష్,ను
సోమవారం ఉదయం తెల్లవారు జామున జగదేవపూర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.
ఈ సందర్భంగామాజీ సర్పంచ్లులు మాట్లాడుతూ..
మండల వ్యాప్తంగా దాదాపు రూ.కోటి పై చిలుకు పెండింగ్ బిల్లులు రావాలని అప్పులు చేసి పనులు పూర్తి చేసి బిల్లులు రాక మనోవేదనకు గురవుతున్నామని అన్నారు.గ్రామ అభివృద్ధిలో భాగంగా మాకు ఉన్న ఆస్తులు అమ్మి, అప్పులు తెచ్చి గ్రామంలోని అభివృద్ధి పనులు చేశామని, కానీ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకంతో పాత బకాయిలను ఇచ్చిన దాఖలు లేవని ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు గడుస్తున్న మాజీ సర్పంచులు బిల్లులు రాక అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పాత బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. ఓయ్ పో సకాలంలో పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా తాము సర్పంచులుగా ఉండి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు కూడా బిల్లు ఇవ్వకపోవడం సరైనది కాదని విమర్శించారు. గత ప్రభుత్వంలో 14 ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా గ్రామాభివృద్ధి కోసం వచ్చేవని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం విధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకుపోయేందుకు అవిశ్రాత కృషి చేశామన్నారు బిల్లులు వస్తాయన్న ఆశతో అభివృద్ధి పనులు చేశామన్నారు తమ పదవి కాలం ముగిసిన ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు రాకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు గతంలోనే చలో అసెంబ్లీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయామన్నారు అయినా ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు లేదన్నారు ఈ తరుణంలోనే చేపట్టిన సీఎం ఇంటి ముట్టడిని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో అడ్డుకుంటుందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బిల్లుల కోసం సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న క్రమంలో అరెస్టు చేశారని చెప్పారు.
ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం.మాటి మాటికి సర్పంచులను అరెస్టు చేసి ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం అని మండిపడ్డారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం