సూర స్రవంతి
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్
హైదరాబాద్ నారాయణగూడ సంధ్య థియేటర్ యాజమాన్యంపై మరియు అల్లు అర్జున్ పై తీవ్రంగా మండిపడ్డ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి.
పుష్ప 2 సినిమాకు వచ్చిన రేవతి కుటుంబం అల్లు అర్జున్ మరియు సంధ్య థియేటర్ యాజమాన్యం వల్లనే వారి కుటుంబం రోడ్డున పడింది. నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.అల్లు అర్జున్ నిర్లక్ష్యం వళ్ళనే ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అనాధలు అయిపోయారు.ఒకరోజు అల్లు అర్జున్ ని అరెస్టు చేసి జైల్లో పెడితేనే సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ని పరామర్శించడానికి బయలుదేరారు. మరి ఆ రేవతి చనిపోయినప్పుడు ఆ పిల్లలకు ఆసరాగా ఆ కుటుంబానికి నేనున్న అని ఏ ఒకరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పలేదు. ఇదేనా మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పద్ధతి న్యాయం అనీ సూర స్రవంతి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.రేవతి కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వాలని సూర స్రవంతి డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ కి ఏ మాత్రం మానవత్వం ఉన్న రేవతి పిల్లలకు అల్లు అర్జున్ పిల్లలు అనుకోని రేవతి ఇంటికి వెళ్లి రెండు కోట్లు రేవతి పిల్లల పేరు మీద డిపాజిట్ చేసి చదువు బాధ్యత తీసుకోవాలని సూర స్రవంతి డిమాండ్ చేశారు.