మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల :
మొయినాబాద్ మండల పరిధిలో గల పెద్దమందరం గ్రామ సరిహద్దుల గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల లో డైట్ మెన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్.ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ కళాశాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాలలో వంటశాల, గ్రంథాలయం,తరగతి గదులను మరియు మొత్తం కళాశాల ఆవరణ గల విద్యార్థులు ఆవస గదులను పరిశీలించారు డైట్ మెనూ కార్యక్రమంలో మరొ అనుకోని అతిథిగా చంద్రశేఖర్ ఐపిఎస్ రావడం జరిగింది.
ఇద్దరు కలిసి విద్యార్థులకు 40 శాతం పెరుగుదలను వివరిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తామని బాగా చదువుకొని నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే కష్టపడే తత్వం అలవర్చుకోవాలన్నారు అలాగే ప్రకాష్ ఐపిఎస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సెల్ ఫోన్స్ వాడకం తగ్గించాలని, డ్రగ్స్ నిషేధించాలని అలాగే ఎలాంటి అనుకొని అపాయం సంభవించినప్పుడు 100 కి కాల్ చేయాలని ధైర్యంగా ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులని వాక్యానించారు ఈ కార్యక్రమంలో గురుకుల మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ రజినీ దీపా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.