మనప్రగతి న్యూస్ /తలమడుగు.
తలమడుగు మండలం లోని కొత్త నందిగామ గ్రామం లొ 5లక్ష లతో నిర్మించాబోతున్న నూతన పాఠశాల భవనానికి మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గ్రామ పటేల్ మాణిక్ రావ్ భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా గ్రామ పటేల్ మాణిక్ రావ్ మాట్లాడుతూ మ గ్రామనికి పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేసిన ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క కూ అలాగే బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ కూ ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమం లొ మాజీ జడ్పిటీసీ బొల్లరపు బాపన్న ప్రతాప్ నర్సయ్య ప్రభాకర్ మల్లేష్ రావుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.