Breaking News

రైతన్నలను కాపాడాలని డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం

రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతలు మరియు లగచర్ల రైతన్నలను కాపాడాలని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వినతి

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ సూచనల మేరకు రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతలు మరియు లగచర్ల రైతన్నలను కాపాడాలని దుండిగల్, డి.పోచంపల్లి, మల్లంపేట్ గ్రామాలలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, దళిత, గిరిజన సంఘ సభ్యులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాన్ని అంధేచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అంతివేతకు గురవుతున్నారు. పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నా భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసి కుట్ర చేస్తుందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఓసారి ఫార్మా విలేజ్ అని మరో ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెబుతూ ఏదో లాగా రైతన్నల భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి 10 నెలలుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా నిరంకుశంగా పాసవికంగా పేద రైతన్నల పైన మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దృష్టికి తెలియజేస్తున్నామన్నారు.
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారి పైన థర్డ్ డిగ్రీని ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుష అమ్మానాన్న వియ్య అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రైతన్నల కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు ఎల్లుగారి సత్యనారాయణ, జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఆనంద్ కుమార్, కుంటి నాగరాజు, మహేందర్ యాదవ్, సాయి యాదవ్, ప్యాక్స్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, నాయకులు కొర్వి రాము, ఈ.శ్రీనివాస్, వేణు గౌడ్, శ్రీకాంత్ యాదవ్, గణేష్, శ్రీధర్, రాజు, రాజ్ కుమార్, కుంట్ల నందు మరియు నాయకులు దళిత, గిరిజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.