జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల మహా ధర్నా
గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగులను కార్మికులను అక్రమ అరెస్టులు చేస్తున్న ప్రజా పాలన ప్రభుత్వం
గ్రామ పంచాయతీ కారోభార్ లను సిబ్బంది ని అక్రమ అరెస్టులను కండిస్తున్న గ్రామ పంచాయతీ సంఘాల జేఏసీ
గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించ బడని యెడల నిరవధిక సమ్మె
గ్రామ పంచాయతీ టీ జి కే ఎస్ యు రాష్ట్ర అద్యక్షులు బింగి గణేష్
మన ప్రగతి న్యూస్/హైదరాబాద్

తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ, టీ జి కే ఎస్ యు, సి ఐ టి యు , ఏ ఐ టీ యు సి, టీ యు సి ఐ, ఐ ఫ్ టి యు ఆధ్వర్యంలో డిసెంబర్ 17 బుధవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా కార్యక్రమానికి తెలంగాణలోని 12,000 గ్రామ పంచాయతీల నుండి కారోబార్లు సిబ్బంది మహాధర్న కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే రాత్రికి రాత్రి గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న కారోబార్లను సిబ్బందిని అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. అక్రమ అరెస్టులను కాదని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10000 మంది వరకు హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్దకు రావడం జరిగింది. టీ జి కే ఎస్ యు రాష్ట్ర అద్యక్షులు బింగి గణేష్ మహా ధర్నా లో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లో గత 30 సంవత్సరాలుగా పని చేస్తున్న సిబ్బందికి కారోభార్ల కి కనీస వేతనం చెల్లించడం లేదు, ఇచ్చే జీతాలు అరకొర అది కూడా 6 నెలకు ఒకసారి జీతాలు చెల్లిస్తున్నారు. పారిశుద్ధ పనులలో నిరంతరం కష్ట పడుతున్న గ్రామలను పచ్చదనం పరిశుభ్రత గా ఉంచుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడం లో జాప్యం చేస్తున్న ప్రజా పాలన ప్రభుత్వం ప్రతి నెల ఒక్కటవ తారీకు జీతాలు చేల్లిస్తున్నము అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రజా పాలన ప్రభుత్వం కింది స్థాయి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు మాత్రం మొండి చేయి చూపిస్తుంది. ఎన్నో సమ్మెలు ఎన్నో వినతి పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పంచాయతి రాజ్ శాఖ మంత్రి సీతక్క కు , ఇతర మంత్రులకు , ఎమ్మెల్యేలకు గ్రామ పంచాయతీ కారోభార్లు సిబ్బంది సమస్యల పైన పలు మార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

సంవత్సరం గడుస్తున్న ఎలాంటి న్యాయం జరుగలేదు ఎప్పుడు వినతి పత్రాలు ఇచ్చిన మీ సమస్యలు న్యాయ బద్దమైనవి కొన్ని అర్థికేతరమైనవి పెద్ద సమస్యలు కావు పరిష్కరం చేస్తామని నోటి మాటలకు చెప్పడం మట్టుకే కానీ ఎలాంటి జి వో ఇప్పటి వరకు రాలేదు.ప్రధానముగా గ్రామ పంచాయతీ లో జీ ఓ నెంబర్ 51 గ్రామ పంచాయతీ సిబ్బంది కి ఊరి తాడుల ఉంది. గ్రామ పంచాయతీ లో గత 30 సంవత్సరాలుగా పని చేస్తున్నవారు కారోభార్, బిల్ కలెక్టర్, గుమాస్తా పంపు ఆపరేటర్, ఎలక్త్రిషన్, సపాయి, ఆఫీస్ అటెండర్ , అనే అన్ని కేటగిరీల వారు ఉన్నారు, కానీ 14 అక్టోబర్ 2019 రోజున గ్రామ పంచాయతీ సిబ్బంది కి అప్పటి ప్రభుత్వం 51 జి వో తీసుకువచ్చి అన్ని కేటగిరిలను తొలగించి తల తోక లేని యం పి డబ్లు అనే నామకరణం చేయడం జరిగింది. ఇలా అన్ని కేటగిరీల వారికి ఏమ్ పి డబ్లూ విధానాన్ని తీసుకురావడం వల్ల గ్రామాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి సిబ్బంది నైపుణ్యం లేని పనులు ట్రాక్టర్ ట్రాలీ నడపడం , వీధి దీపాలు వేయమనడం వల్ల ట్రాక్టర్లు బోల్తా పడి, విద్యుత్ స్థంభాల నుండి పడి ఇప్పటి వరకు 180 మంది పంచాయతీ సిబ్బంది మారనిచినారు. మరణించిన కుటుంబాలు వారి పిల్లలు రోడ్డున పడ్డారు, మరణించిన వారికి గ్రామ పంచాయతీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఒక్క రూపాయి అందలేదు. అందుకే గ్రామ పంచాయతీ సిబ్బంది కి నేరుగా ప్రభుత్వమే ఇన్స్యూరెన్స్ ప్రతి సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి చెల్లించాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు ఎంత దృగంధం వేదజ్జల్లిన , రోడ్ల పైన ఎంత చెత్త ఉన్నా, రోడ్లను మురికలవలలో ,ఇండ్లలో ఉన్న చెత్తను ట్రాక్టర్ ట్రాలీ ద్వారా సేకరించి గ్రామాల్లోని ప్రజలకు డెంగ్యూ ,చికెన్ గున్యా, దోమల బెడద లేకుండా చేస్తూ చెత్తను డంపింగ్ యార్డు కు తరలిస్తున్నారు,గ్రామ పంచాయతీలో కారోభార్ల పాత్ర కీలకం గ్రామాల్లో ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల సర్వే, ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, పచ్చదనం పరిశుభ్రత, ఇంటింటా ఇందిరమ్మ ఇండ్ల సర్వే అన్ని పనులలో గ్రామానికి ఏ అమాత్యుడు అధికారులు ఉద్యోగులు వచ్చిన మొదట కలసేది కారొభర్లనే , గ్రామాల్లో కరోభర్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నపుడు విద్య అర్హతను బట్టి ప్రమోషన్లలో భాగంగా పంచాయతీ కార్యదర్శి గా పోస్టులు భర్తీ చేసే వారు, ఇప్పటికీ గ్రామ పంచాయతీ కారోభర్లు ఇంటి పన్ను వసూలు చేయడం నల్ల పన్ను వసూలు చేయడం గ్రామ పంచాయతీ సిబ్బందిని గ్రామ పనులకు పురమయించడం, వీధి దీపాల వెలగని స్థంబంలకు వీధి దీపాలు వెలిగించేటట్లు చేయడం , నల్ల రాని ఇంటికి నల్ల కనెక్షన్ లు ఇప్పించడం త్రాగు నీరు వచ్చే విధంగా లికేజీలకు సంబంధించి మెటీరియల్ తేవడం , గ్రామంలో వి ఆర్ యే వ్యవస్థ పోయినప్పటి నుండి కారోభర్లు గ్రామానికి రెవెన్యూ అధికారులకు, పోలీస్ సిబ్బందికి , మిషన్ భగీరథ అధికారులకు , ఇరిగేషన్ అధికారులకు, అన్ని శాఖల అధికారులు గ్రామ ప్రజల యొక్క ప్రతి సమస్య గ్రామాలలో నిరంతరం ఉండే మాకు తెల్వడంతో వారికి సహాయ కారిగా కూడా పనులు చేస్తున్నాము. గ్రామాలలో డంపింగ్ యార్డు డంపింగ్ షెడ్డు స్మశాన వాటిక పల్లె పకృతి వనలు యవెన్యు ప్లాంటేషన్ అన్నింటినీ ఎప్పటి కప్పుడు చూడడం జరుగుతుంది. పెన్ను పట్టి రాసే కారోభర్లను ఈ రోజు అన్ని పనులు చేయాలని మమ్ములను అవమనిచ్చుతున్నారు వెంటనే గ్రామ కారోభర్లను వారి విద్య అర్హతను బట్టి గ్రామ కార్యదర్శికి సహాయ కార్యదర్శి గా నియమించాలి. గతం నుండి గ్రామ కారోభర్లకు అన్ని కేటగిరీల సిబ్బంది కంటే ఎక్కువ జీతం వుండేది కానీ 51 జీ వో తో అన్ని కేటగిరీల వారిని ఒక్కటి చేసి అందరికీ ఒకే జీతం చెల్లిస్తున్నారు. ఇది ముమ్మాటికి అన్యాయం డిగ్రీలు పిజిu చదువుకున్నవారిని కూడా చూడకుండా యం పీ డబ్లు తేవడం సమాజసం కాదు అని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలోటి జి కే స్ యు రాష్ట్ర అద్యక్షులు బింగి గణేష్, టి జి కే స్ యు రాష్ట ఉపాధ్యక్షులు చిలుక మారుతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మారేల్ల రాజేష్ సీ ఐ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏ ఐ టి యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకట్రజంసి ఐ టి జి యు , రాష్ట కార్యదర్శి జె వెంకటేష్, ఏ ఐ టీ యు సి, ఎం డి యూసఫ్ , టి యు సీ ఐ, పి అరుణ్ కుమార్, ఐ ఎఫ్ టి యు యన్ ధాసు , సి ఐ టీ యు చాగంటి వెంకటయ్య, సి ఐ టీ యు గ్యారా పాండు, సి ఐ టీ యు పాలడుగు సుధాకర్, టి యు సీ ఐ యాం వెంకట్, తెలంగాణ రాష్ట గ్రామ పంచాయతీ కారోభర్లు సిబ్బంది పాల్గొన్నారు.
